రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » మీ కలలు ఏమంటున్నాయి...? (Dream, dream, astrology, articles, human, dreams, past, future, present)
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
FILE
ప్రతి మనిషికి కలలు అనేటివి ఉంటాయి. వాటిలో నిద్రపోయినప్పుడు వచ్చే కలలు, తమకు తాముగా నిర్దేశించుకునే కలలు. వీటిని సాధించేందుకు నిత్యం శ్రమిస్తుంటారు కొందరు. దీంతో వారి కలలకు సాకారం ఏర్పడుతుంది. అలాగే సహజంగా నిద్రపోయినప్పుడు వచ్చే కలలు కొన్ని సూచనలు చేస్తుంటాయి. దీంతో మనిషి జాగ్రత్తపడుతుంటాడు.

కొన్ని రకాల కలలు ఆనందాన్ని ఇచ్చేటివిగా ఉంటాయి. కొన్ని కలలు మనసుకు నిరాశను కలిగిస్తుంటాయి. ఇవ్వన్నీకూడా మనిషి ఆత్మతో సంబంధం ఉంటుంది. మనిషి నిద్రలోనున్నప్పుడు అతని శరీరం ఆత్మనుంచి వేరుపడుతుంది. ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ నిద్రపోదు.

మనిషి నిద్రావస్థలోనున్నప్పుడు అతని పంచ జ్ఞానేంద్రియాలుకూడా తమ పనికి విశ్రాంతినిస్తాయి. ఇలాంటి సందర్భంలో మనిషి మస్తిష్కం పూర్తిగా ప్రశాతంగా ఉంటుంది. ఈ స్థితిలోనున్నప్పుడు మనిషికి ఓ రకమైన అనుభవం ఎదురవుతుంటుంది. అది వారి జీవితంతో కూడుకున్నదై ఉంటుంది. ఆ అనుభవాన్నే కల అని అంటారు.

ఈ కలల ఆధారంగానే మనిషియొక్క భూత, భవిష్యత్, వర్తమానాలగురించి తెలుసుకోవచ్చంటున్నారు జ్యోతిష్యులు. మీ కలలు ఏం చెపుతున్నాయో తెలుసుకుందాం...

మీరు నిద్రావస్థలోనున్నప్పుడు వివిధ వస్తువలు, పదార్థాలను చూస్తే ఏమవుతుంది?

** చేపలను చూస్తే... ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.

** మాంసం తింటున్నట్లు మీరు కలగంటే... దెబ్బలు తగులుతాయి.

** మీ కలలో మీరు దెబ్బలు తింటున్నట్లు కనపడితే... మీరు పరీక్షలలో అనుత్తీర్ణులయ్యే సూచనుల కనపడుతున్నాయి.

** గాల్లో తేలినట్లు కల వస్తే... ప్రయాణానికి సంకేతం.

** కాళ్ళు, చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే... మీకున్న అన్ని రకాల దుఃఖాలు, కష్టాలు తొలగిపోయనట్లేనని అర్థం.

** మీరు కలలో పెళ్ళికూతురుతో ముద్దాడుతున్నట్లు కలవస్తే...శత్రువులతో సంధికుదుర్చుకుంటారని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

** సర్పాన్ని పట్టుకోవడంలాంటి కలవస్తే... మీరు భవిష్యత్తులో ఫలితాలను చేజిక్కించుకుంటారని ఆ కలయొక్క అర్థం.

** కలలో ఒంటెను చూస్తే... రాజభయం

** కలలో మీ గెడ్డానికి కాస్త షేప్ ఇచ్చేలా కలగంటే... మీ దాంపత్య జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోయినట్లేనంటున్నారు జ్యోతిష్యులు.

** పెద్దలు మిమ్ములను ఆశీర్వదిస్తున్నట్లు కలవస్తే... గౌరవ ప్రతిష్టలు లభిస్తాయని అర్థం

** మీ కలలో మీ మెడ నిటారుగా ఉంటే... ధనప్రాప్తి కలుగుతుంది.

** మీరు పాలుతాగుతున్నట్లు కలగంటే... గౌరవ మర్యాదలు లభిస్తాయంటున్నారు జ్యోతిష్యులు.

** నీళ్ళు తాగుతున్నట్లు కలగంటే...భాగ్యోదయం కలుగుతుంది.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కలలు, మనిషి, ఆత్మ, నిద్రావస్థ, జ్ఞానేంద్రియాలు, జ్యోతిష్యులు, భూత, భవిష్యత్, వర్తమానాలు, చేపలు, మాంసం