రేవతి నక్షత్రములో జన్మించిన జాతకులు దౌర్జన్యం, తగాదాలకు దూరంగా ఉంటారని జ్యోతిష్కులు అంటున్నారు.
ఆడంబరం అంటే ఏ మాత్రం ఇష్టపడని ఈ జాతకులు విద్యారంగంలో రాణిస్తూ మేధావులుగా ఉంటారు. గణితంలో మంచి ప్రజ్ఞ కలిగి ఉంటారు. విజ్ఞాన, వేదాంగాలను పఠించే వీరు, ఇతరుల సొమ్ముకు ఆశపడరు.
ఇంకా రేవతి నక్షత్రంలో పుట్టిన జాతకులు కష్టపడి పనిచేస్తారు. అంతేగాకుండా వీరికి తొందరగా కోపం రాదు. ప్రశాంతంగా, నిబ్బరంగా సమాధానం చెప్పడం అన్ని సమస్యల్ని పక్కనపెట్టి, ఆర్థికంగా ఉన్నత స్థాయిని చేరుకుంటారు.
వివాహ జీవితంలో ఆరంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా, తర్వాత సర్దుకుపోతాయి. పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకునే రేవతి నక్షత్ర జాతకులు మంచితనంతోనే ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. వినూత్నమైన వ్యాపారాలలో ఉన్నత పదవులను అలంకరిస్తారు. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటారు.
వ్యాపారాల్లో అభివృద్ధి చెందేందుకు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఈ జాతకులు ప్రతి బుధవారం, నవగ్రహాలను ప్రదక్షిణ చేసి, నువ్వులనూనెతో బుధ భగవానుడికి దీపమెలిగించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అదేవిధంగా.. విఘ్నేశ్వరునికి తొమ్మిది వారాల పాటు నేతితో దీపం పెడితే సకల సంపదలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.