మిథున లగ్నంలో జన్మించిన మహిళలు ఆడంబర జీవితానికి ప్రాధాన్యతనిచ్చే విధంగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా మంచి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు.
ఎలాంటి కార్యంలోనైనా ఇతరులపై అధికారం చెలాయించి, బాధ్యతతో ఆ పనిని పూర్తి చేయడంలో నిపుణులు. ఎల్లప్పుడు ఆనందంగా, ఉత్సాహం కన్పిస్తారు. మంచి గుణవంతురాలుగా ఉంటారు. మర్యాద, సంస్కారం వీరికి మెండు. భర్త వద్ద వినయంగా నడుచుకుంటారు. సంతానం అంటే వీరికి అధిక ప్రేమ. వారిపట్ల అధిక ప్రేమపూరితంగా నడుచుకుంటారు.
కుటుంబవ్యవహారంలో సంక్షేమాన్ని గుర్తుంచుకుని బాధ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబవ్యవహారంలో తమకే ఆధిక్యత వహించాలని భావిస్తారు. వీరికి ఇతరుల పొగడ్తలంటే మక్కువ ఎక్కువ. ఇతరుల కష్టాలను చేతులు తట్టి ఆనందించేవారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ జాతకులకు కాస్త ఆరోగ్య విషయంలో మాత్రం సక్రమం ఉండదు. వ్యాధులు వీరికి చెంతనుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్తత్త వహించాలి.
మిథున లగ్నంలో జన్మించిన వారికి చిన్ననాటి నుండే బాధ్యతల మోత తప్పదు. చిన్నపాటి కుటుంబ వాతావరణంలో జన్మించినా వారికి సామర్థ్యతలో ఎలాంటి లోటు ఉండదు. తల్లి వద్ద ఎలాంటి సందర్భాల్లోనైనా ప్రేమపూరితంగా ఉంటారు. తండ్రి వద్ద మాత్రం కొంత పరిమితం ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఈ జాతకులు ఆరోగ్యకరంగా ఉండాలంటే శుక్రవారాల్లో అమ్మవారికి నేతిదీపమెలిగించడం శ్రేయస్కరం. మంగళ, శుక్రవారాల్లో అమ్మవారి ఆలయాల్ని దర్శించుకుని, పేదలకు తమకు వీలైనంత సాయం చేయడం ద్వారా వీరికి ఆరోగ్యపరమైన సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.