నవగ్రహాల్లో ప్రధానమైన సూర్యగ్రహ సంఖ్య అయిన 28వ తేదీన పుట్టిన వారు గొప్ప విద్యావంతులవుతారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వీరి వద్ద డబ్బు ఉన్నంత కాలం ఆప్తులు, స్నేహితులు గౌరవించి, ఆ తర్వాత అనేక బాధలు కలుగ జేస్తుంటారు.
అందుచేత దాయాదులు, స్నేహితుల వద్ద పరిమితంగా మెలగడం మంచిది. అంతేగాకుండా.. బంధువుల వలన, మిత్రవర్గము వలన ఆస్తిని పోగొట్టుకునే అవకాశాలున్నాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు.
దాయాదుల వలన కలహములు, కష్టనష్టాలు ఎక్కువ. వీరికి గుణవతియగు భార్య లభించడంతో వైవాహిక జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంటుంది. ఈ సంఖ్యలో పుట్టిన కొందరు గ్రంథ రచయితలు, రాజకీయవేత్తలవుతారు. ఇంకా పలుకుబడి, వాహనయోగము కలిగి ఉంటారు.
ఈ సంఖ్యలో పుట్టిన వారికి 25 సంవత్సరాల తర్వాత మంచి మార్పు కలుగుతుంది. అదేవిధంగా 37 సంవత్సరాల వరకు సామాన్యం. 28-30 సంవత్సరం మధ్యలో అనేక కష్టాలు సంభవిస్తాయి.
కనుక ఈ కష్టాల నుంచి బయటపడేందుకు ప్రతి శుక్ర, మంగళవారాల్లో విఘ్నేశ్వరునికి నేతి దీపమెలిగించడం మంచిది. అయితే 41 సంవత్సరాల నుంచి ఈ జాతకులకు భోగ భాగ్యములు ప్రాప్తిస్తాయి. వీరికి జీవితంలో ఉత్తరార్థం బాగుంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు.