రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » మీరు పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించారా? (Astrology| Purvashada| Nakshatram| Black| Silver| Sukra Graham)
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
WD
పూర్వాషాఢ నక్షత్రం శుక్రగ్రహ నక్షత్రమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ నక్షత్రములో జన్మించిన జాతకులు ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటారు. ఇతరులను ఇట్టే ఆకట్టుకునే వాక్చాతుర్యత, అందం వీరి సొంతం.

స్నేహితులతో ఉమ్మడిగా జీవితంలో చెప్పుకోదగిన విజయాలు సాధిస్తారు. స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నత స్థానాన్ని అలంకరిస్తారు. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణిస్తారు. ఆధ్యాత్మిక విషయాలంటే వీరికి ఆసక్తి ఎక్కువ.

విలాసవంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. నాయకత్వ లక్షణాలు వీరికి మెండు. అయితే సహోదర వర్గం వల్ల అపఖ్యాతి, నమ్మిన వాళ్లచే మోస పోవడం జరుగుతుంది. కానీ సహోదరీ వర్గం అన్ని విధాలుగా మీకు అండగా నిలుస్తారు. జీవితంలో అనేక రకాల కష్టనష్టాలను చవిచూసిన ఈ జాతకులకు పూర్వీకుల ఆస్తులు కొంతమేరకే కలిసి వస్తాయి.

ఇకపోతే.. బుధవారం వీరికి అదృష్టమైన రోజు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో ఎలాంటి పనులు చేపట్టినా ఆశించిన ఫలితాలుండవు. నలుపు, సిల్వర్ రంగులు గల దుస్తులను ధరించడం మంచిది.

లేదా నలుపు చేతి రుమాలును వాడటం ద్వారా కొన్ని సమస్యల నుంచి తప్పించుకునే ఆస్కారం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా శుక్రగ్రహ శాంతి కోసం శనివారాల్లో నేతి దీపమెలిగించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి.

వీరి అదృష్ట సంఖ్య: 3
కలిసిరాని సంఖ్యలు: 5, 6.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: పూర్వాషాఢ, నక్షత్రం, నలుపు, సిల్వర్, శుక్రగ్రహం