ప్రధాన పేజిఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » 13వ తేదీన పుట్టారా? ఐతే వీరు చెప్పిందే వేదం! (Numerology| 13th Date| Buddha| Rahu Graham| Cinema| Jyothishyam)
బుధ, రాహు గ్రహాలు బలంగా ఉన్న 13వ తేదీ జన్మించిన జాతకులు సినిమా నటులుగానూ, జ్యోతిష్య, హస్తముద్రికులుగానూ రాణిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. 13వ తేదీ తెల్లవారుజామున జన్మించిన వారు పరోపకార పరాయణులై గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు.
వీరిలో రాత్రి జన్మించినవారు గంభీర హృదయులు, ధైర్యసాహసాలు గలవారుగా ఉంటారు. ఇంకా వీరికి పూర్తి పితృసుఖం కలుగుతుంది. అధికార గర్వము, దర్పము అధికముగా కల్గి ఉండే ఈ జాతకుల్లో కొందరు కవులు, గాయకులు అయ్యే అవకాశం ఉంది. శాంతిచిత్తం గలవారైన వీరు తమ తోచినదే వేదమనే తత్త్వం కలిగి ఉంటారు.
పుస్తకవ్యాపారంతో పాటు అన్ని వృత్తులు వీరికి కలిసి వస్తాయి. ఈ జాతకుల్లో కొందరు అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. మరికొందరు కామర్సు పరీక్షలలో ఉత్తీర్థులై పెద్ద ఉద్యోగాలను సంపాదిస్తారు.
ఇకపోతే.. 13వ తేదీన జన్మించిన జాతకులు.. బుధ, రాహు గ్రహాల శాంతికోసం శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేయడంతో పాటు నువ్వుల నూనెతో దీపమెలిగించడం శ్రేయస్కరం. ఇలా 9 వారాలు చేయడం ద్వారా గ్రహశాంతితో పాటు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడం, ఈతిబాధలు తొలగిపోవడం జరుతుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు.