రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » గ్రహణ సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి...! (Solar eclips | surya grahanam | sun | mantram | pooja | prarthna | prayer)
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
FILE
గ్రహణ సూతకము 21 జులై నెల 2009న సూర్యాస్తమైన సమయంనుంచే ప్రారంభమౌతుంది. గ్రహణంలో వర్జిత పనులు, గ్రహణ సూతకము మరియు గ్రహణ కాలంలో భోజనం చేయడం, నీరు త్రాగడం, సంభోగాది కార్యాలు చేయరాదు. గ్రహణం సమయంలో నిద్రపోవడం, మలమూత్రాదులు విసర్జించడం, తైలాభ్యంగన స్నానం చేయకూడదు.

గ్రహణ సూతకంలో పిల్లలు, వృద్ధులు, రోగాలతో బాధపడుతున్నవారికి తినడంపై ఎలాంటి నిషిద్ధం లేదు. గ్రహణం పట్టిన సమయంలో వండిన అన్నం, తరిగిన కూరగాయలు, పండ్లు కలుషితమౌతాయి. వీటిని భుజించకూడదు.

కాని నూనె, నెయ్యితో చేసిన వంటకాలు ఉదాహరణకు అన్నం, నెయ్యి, నూనె, పాలు, పెరుగు, లస్సీ, వెన్న, పన్నీరు, ఊరగాయలు, చట్నీ, మురబ్బాలో నువ్వులు లేదా దర్బలు ఉంచితే ఆ పదార్థాలు కలుషితం కావంటున్నారు జ్యోతిష్యులు. డ్రై ఫుడ్‌లపై నువ్వులు లేదా దర్బలు ఉంచాల్సిన అవసరం లేదు.

గ్రహణం సమయంలో ఏదైనా మంత్రాన్ని పఠిస్తే అది శీఘ్రంగా ఫలిస్తుందంటున్నారు జ్యోతిష్యులు. ప్రధానంగా మహా మృత్యంజయ మంత్రాన్ని జపిస్తే కష్టాలు తొలగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అందునా శ్రావణమాసం ప్రారంభమౌతుంది. ఏదైనా కార్యం సిద్ధించేందుకు మంత్రాన్ని జపించాలనుకునేవారు ఇలాంటి సమయంలో జపిస్తే ఉత్తమమం అంటున్నారు జ్యోతిష్యులు.

గర్భిణీ స్త్రీలు గ్రహణం పట్టే సమయంలో సూర్య కాంతికి కూర్చోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు తరగడం.. ఇత్యాది వంట పనులు చేయకూడదు.

ఈ గ్రహణం పట్టే కాలంలో వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్రాన్ని జపించండ వల్ల ఫలితం ఆశాజనకంగా ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: గ్రహణం, సూర్యగ్రహణం, భోజనం, నీరు, నిద్ర, తైలాభ్యంగన స్నానం