రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » గ్రహణ సమయం‌లో అనుష్ఠానం అతి శక్తివంతమవుతుంది (Suryagrahanam | Anustanam | Pray the God | Oem Namah Shivaya)
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
WD
గ్రహణ సమయము ఆథ్యాత్మిక లోకంలో సాధకులకు విశేష సమయము. ఈసమయాన జరిపే జపము ,తపము ,దానము కోట్లరెట్లు ఫలితాన్నిస్తుందని శాస్త్రవచనము. ఇటువంటి పవిత్రసమయంలో పవిత్రనదీ తీరానగాని లేక పవిత్ర స్థలానగానీ లేక మీ గృహములోనే శుద్ది చేసుకున్న స్థలములో కూర్చుని మీ కులాచారము ప్రకారముగానీ, గురుపరంపర నుంచి వస్తున్న మంత్రాలను గానీ జపించుకోవటము వలన శీఘ్రమే ఫలితాలనిస్తాయి.

ఏ మంత్రమూ గురువు వద్దనుంచి పొందనివారు కూడా "ఓం నమ: శివాయ" అనే పంచాక్షరిని గానీ, "ఓం నమో నారాయణాయ" అనే మంత్రాన్ని గానీ నిరభ్యరంతరంగా జపం చేసి భగవదనుగ్రహం పొందగలరు. నామ జపం చేసుకునేవారు కూడా ఈ విధానంగానే జపం చేసుకోవచ్చు.

గ్రహణం పట్టే ముందుగా స్నానం చేసి జపం చేసుకుని గ్రహణానంతరం మరలా స్నానం చేసి మీ ఇంటి లోనున్న పూజా గృహాన్ని శుద్ధి చేసుకుని పటాలు లేక విగ్రహాలను కూడా ఆవుపాలు శుద్ధ జలంతో శుద్ధిపరచుకుని వారికి ఉపచారాదులు[పూజ] చేసుకోవాలి. తదనంతరం మాత్రమే ఏదైనా స్వీకరించాలి. పొద్దుటే టీ- కాఫీలు త్రాగేవారు రేపొద్దున్న ఒక్కపూట ఆ అలవాటుకు మానుకోవటం మంచిది.

తమకర్ధం కాకపోయినా ఇదెందుకు అనే వితండవాదుల వాదనలతో సమయము వృధాపుచ్చుకోక మనపెద్దలు ఘన విజ్ఞానులనే విషయము నమ్మి వారు చూపిన బాటలో శుభాలకోసము ప్రయత్నం చేద్దాము
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: గ్రహణ సమయము, జపము, తపము, దానము, ఓం నమ శివాయ