రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » ఆగస్టు 7, 2009న పుట్టినవారు సైంటిస్టులవుతారు (7, 8, 2009 | birthday | child birthday | Sankhya shastram | numerology)
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
FILE
ఆగస్టు 7వ తారీఖున ఓ విశేషమైన యోగం ఉంది. ఆ విశేషమైన రోజు పుట్టే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందామా మరి. ఆగస్టు 7న జన్మించేవారు భారతీయ జ్యోతిష్య శాస్త్రాన్ననుసరించి మకర, కుంభ రాశులలో జన్మిస్తారు. సంఖ్యాశాస్త్రానుసారం ఇలాంటి జాతకులు పరిశోధనారంగంలో రాణిస్తారు.

వీరికి మిత్రుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. వీరు ఏకాంత ప్రియులు, తక్కువగా మాట్లాడేవారుగా ఉంటారు. వీరి శరీర సౌష్టవం ఓ మోస్తరుగా ఉంటుంది.

వీరు మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులుగాను, పిల్లల వైద్యులుగాను రాణిస్తారు. వీరి జీవితంలో శనిగ్రహం శుభాశుభ ఫలితాలను ఇస్తాడు. ఎవరైతే 7వ తేదీ ఆగస్టు నెల 2009వ సంవత్సరంలో జన్మిస్తారో వీరి లగ్నానుసారం శని-కుజుని ప్రభావం ఉంటుంది.

ప్రస్తుతం శని సూర్య రాశిలో కుజుడు, శుక్రునికి చెందిన వృషభ రాశిలోనున్నాడు. శని దశమ స్థితిలో కుజునిపై మరియు కుజుని చతుర్థ దృష్టి శనిపై పడుతుంది. ఇది శుభకరం కాదు.

మకర రాశిలో పుట్టిన శిశువులు ఓ మోస్తరు ఎత్తులోనుంటారు. కష్టపడి పనిచేసే స్వభావులుగా ఉంటారు. ఈ జాతకులు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను పొందుతారు. వీరు చేసే పనులలో ఇబ్బందులు ఎదురౌతుంటాయి. అదే కుంభ రాశిలో పుట్టిన శిశువులు జీవితంలో ఒంటరిగా ఉంటారు. వీరుకూడా కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను పొందుతారు.

వీరు చేసే పనులలో ఇబ్బందులు తలెత్తినా చివరికి మంచి ఫలితాలను పొందుతారు. వీరి జాతకంలో శని-కుజుని దృష్టి లేకుంటే వీరికి మంచి భవిష్యత్తుంటుందంటున్నారు జ్యోతిష్యులు.