రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » తులారాశిలో జన్మించారా? ఐతే అలంకార ప్రియులే! (Thula Rasi| Jyothisham| Astrology| Make-up)
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
FILE
తులారాశిలో జన్మించిన జాతకులు జీవితాన్ని పోటీగా తీసుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మేధావులుగా గుర్తింపు పొంది, అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు.

కళా సాహిత్య, రాజకీయ రంగాల్లో రాణించే ఈ జాతకులు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. యౌవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం కలిసివస్తుంది. విలాసవంతమైన జీవితానికి లేక వస్తు సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేసే మనస్తత్వం కలిగి ఉంటారు.

జీవిత ప్రారంభంలో ఎదురైన కొన్ని ఘట్టాలకు కుంగిపోకుండా ఉపాయంతో మంచి లక్ష్యాలను సాధించే దిశగా పట్టుదలతో ముందడగు వేస్తారు. తమ ఆలోచనా విధానాన్ని గోప్యంగా ఉంచుతారు.

ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో వీరు అందవేసిన చేయి. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తుల వృద్ధి జరుగుతుంది. వంశానుక్రమంగా వచ్చిన వ్యాపారాలను మార్పుచేసి అభివృద్ధి చేస్తారు.

అయితే బంధువర్గంతో ఉన్న విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. అందుచేత ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం.

ఏ విషయంలోనూ రాజీ పడకుండా శ్రమించే మనస్తత్వం కలిగి ఉండే ఈ జాతకులు, వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. జీవితంలో కొన్ని నిందారోపణలు బాధకలిగిస్తాయి.

ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి ఉద్యోగ వ్యాపార, వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ముఖ్యంగా వీరికి శని మహర్దశ రాజయోగాన్నిస్తుంది. ఈ రాజయోగం వీరి సంతానానికి కూడా వర్తిస్తుంది.

పడమటి, దక్షిణ దిక్కులు ఈ జాతకులకు అనుకూలిస్తాయి. శుక్రమౌఢ్యమి కాలంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. శని, శుక్ర, గురు గ్రహముల సంచారమును అనుసరించి శుభకార్యాలను ప్రారంభించడం శ్రేయస్కరం.

ఇంకా ఈ జాతకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం చేత గురువారం వీరికి అనుకూలమైన రోజు. వీరి అదృష్ణ సంఖ్యలు: 6, 4, 5, 8. అయితే 1, 2 సంఖ్యలు ఈ జాతకులకు కలిసిరావు.

గురువారం పూట గురుభగవానుడికి నేతితో దీపమెలిగిస్తే తులారాశిలో జన్మించిన జాతకులకు ఈతిబాధలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: తులారాశి, జాతకులు, జ్యోతిష్య శాస్త్రం, భవిష్యవాణి, అలంకార ప్రియులు