ప్రముఖ చలనచిత్ర నటుడు, సకలకళావల్లవన్ కమలహాసన్, సారికల కుమార్తె శ్రుతి హాసన్ ఇటీవల చలనచిత్ర రంగంలోకి ప్రవేశించింది. ఆమె నటించిన తొలి చిత్రం ఆమెకు ఏమంతగా పేరు తెచ్చి పెట్టలేదు సరికదా శ్రుతికి గుర్తింపు కూడా కలగలేదు.
నటిగా నటించేకన్నా కూడా కళా రంగంలోనే మరేదైనా విభాగంలో తన కెరీర్‌ను మలచుకుంటే ఫలితం ఉంటుంది. నటనా రంగం ఆమెకు అంతగా కలిసిరాదంటున్నారు జ్యోతిష్య పండితులు.
శ్రుతి పుట్టిన తేదీ 28 జనవరి 1986. దీనినిబట్టి సూర్యకుండలిని గమనిస్తే ఆమె మకర లగ్నం సింహరాశిలో పుట్టిందని జ్యోతిష్యులు చెపుతున్నారు. మకర లగ్నంలో జన్మించిన వ్యక్తులు కాస్త అనుమానాలతో, అసహనంగా వ్యవహరిస్తుంటారు. వీరిలో ఆత్మస్థైర్యం తక్కువనే చెప్పాలి.
లగ్నంలోనున్న బుధుడు, శుక్రుడు మంచి పొజిషన్‌ను ఇస్తారు. కాని శుక్రుడు మకర రాశి వ్యక్తులకు అభివృద్ధిలో ఆటంకం కలిగిస్తుంటాడు. శుక్రుడు, బుధుడు కలిసి ఉండటం చేత కళారంగంలో రాణిస్తారు.
ద్వితీయంలో మేషంలో గురువు ఉండటంతో కుటుంబసౌఖ్యం చాలా తక్కువగానే ఉంటుంది. కాని ఈ జాతకులు మృదు స్వభావులుగా వ్యవహరిస్తుంటారు. కాని ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటుంది.
చతుర్థ-దశమంలో రాహువు-కేతువు కారణంగా ఈ జాతకుని తల్లి ఆరోగ్యంలో బాధ, మానసిక వేదన లేదా కుటుంబంనుంచి వేరుగా ఉండటం జరుగుతుంది.
అలాగే ఆదాయంలో కుజ-శనిలుండటంతో అనిశ్చితి ఏర్పడుతుంది. వీరికి సక్సెస్ అంతగా ఉండదు. మిత్రులే వీరికి హాని తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం శ్రుతి హాసన్ జాతకంలో రవి మహర్దశలో రాహువు అంతర్భుక్తి నడుస్తోంది. ఈ మహర్దశ అంత యోగ్యమైనది కాదు. రానున్న సంవత్సరం(2010)లో శ్రుతికి అంత అనుకూలమైనదిగా కనపడటం లేదు.
2011-12లో ఒకటి రెండు చిత్రాలు మంచి చిత్రాలుగా నమోదు చేసుకోనున్నాయి. వాస్తవానికి ఆమె శోకపూరితమైన పాత్రలలో నటించడమే ఉత్తమం.తన కెరీర్ కోసమే ఈ రంగంలో ఉండటం ఏమంత లాభదాయకం కాదు.
నటిగా నటించేకన్నా కూడా కళా రంగంలోనే మరేదైనా విభాగంలో తన కెరీర్‌ను మలచుకుంటే ఫలితం ఉంటుంది. నటనా రంగం ఆమెకు అంతగా కలిసిరాదంటున్నారు జ్యోతిష్య పండితులు.