మేషం: సెప్టెంబర్ నెలలో మేష రాశి జాతకులకు తమ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. మీ మనోబలం పెరుగుతుంది. కాని ఆరోగ్యం మందగిస్తుంది. ఈ రాశివారికి ఈ నెలలో భూలాభం కలిగే సూచనలు మెండుగా ఉన్నాయి. మీకు శత్రుజయం కలుగుతుంది. ప్రణాళికాబద్ధంగా దూర ప్రయాణం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు తమ విద్యలో కాస్త మెరుగు కనపరుస్తారు.
వృషభం: వృషభరాశివారికి ఉద్యోగావకాశాల కొరకు తీవ్ర పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. మీ ఇంట్లో శుభ కార్య్రకమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు భూలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు కలుగుతుంది. దీంతో మీ మానసిక ఒత్తిడి పెరుగే సూచనలున్నాయి.
మిథునం: ఈ రాశివారు సెప్టెంబర్ నెలలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. మనసుకు ఇబ్బంది కలిగే అంశాలు జరిగే సూచనలున్నాయి. అనవసరంగా ఆలోచించకండి. ధార్మిక కార్యక్రమాల వలన లాభం కలిగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.
కర్కాటకం: కర్కాటక రాశివారికి ఈ నెల మిశ్రమ ఫలితాలనిస్తుంది. ప్రతిష్టకు పోయి వివాదాల జోలికి పోకండి. శత్రుపరాజయం కలుగుతుంది. ఈ నెలలో అనవసరపు ప్రయాణాలుంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే సూచనలున్నాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఉద్యోగస్తులకు లాభదాయకం కలుగుతుంది.
సింహం: ఈరాశివారికి సెప్టెంబర్ నెలలో విశేషమైన లాభాలు కలిగే అవకాశాలున్నాయి. గౌరవం దక్కుతుంది. ఉద్యోగులకు పదోన్నతిలో కాస్త ఇబ్బందులు తలెత్తుతాయి. కష్టపడితే ఫలితం ఉంటుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. అనవసరమైన ఒత్తిడులకు దూరంగా ఉండండి.
FILE
కన్య: కన్యారాశి జాతకులకు ఈ నెల సుఖవంతంగా గడుస్తుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. మనస్పర్థలు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు కోపాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించండి.
తుల: తులారాశి జాతకులకు ఈ నెలలో ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. మిత్రుల సహకారాలు లభిస్తాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. చెప్పుడు మాటలు వినకండి. పనులు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. మీ భాగస్వామికి ఇబ్బందులు తలెత్తే సూచనలు కనపడుతున్నాయి.