దేశంలో అతి పెద్ద రెండవ రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ కుమ్ములాటలకు కారణాలు అనేకం. కాని జ్యోతిష్యుల మాటల్లో వింటుంటే... బీజేపీ పార్టీకి చెందిన గ్రహాలు, అలాగే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ శని-కుజ గ్రహాలతో ఇబ్బందులకు గురవుతుండారు. దీంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. దీనికంతటికి కారణం ఆ పార్టీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టక పోవడమేననేది రాజకీయ విశ్లేషకుల భావన.
బీజేపీ కూటమికి చెందిన లగ్నం మిథున రాశిలో ఉంది. అదే బీజేపీ అధ్యక్షుని జన్మ లగ్నం కూడా మిథునం. బీజేపీ కూటమి లగ్నం భాగ్యంలో శని, కుజ గ్రహాలు దశమ భావంలో ఉన్న గురువుతో కలిసి ఉండటం మూలాన శని అపకారిగా ఉండాడు.
అదే బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ జన్మ లగ్నంలో కుజుడు ఉన్నాడు. శని చతుర్థంలో కన్యారాశిలో ఉన్నాడు. కుజుడ్ని శని చూస్తుండాడు. దీంతో ఈ జాతకుడు జనాదరణ కోల్పోతాడు.
దీనినిబట్టి చూస్తే రాజ్‌నాథ్ యోగం నల్లేరు మీద నడకలాంటిది కాదు. అదే గురువు దశమంలో ఉండటం. అది గురువు స్వరాశి కావడంతో ఈ జాతకునికి అధికారం లేకపోయినా ఉన్నత స్థానం కలుగుతుంది. అదే ప్రస్తుతం ఆయన లోక్‌సభలో సభ్యునిగా ఉన్నారు.
ఎప్పటివరకైతే రాజ్‌నాథ్ బీజేపీ అధ్యక్షునిగా కొనసాగుతుంటారో అప్పటి వరకు పార్టీ పుంజుకోదని, పార్టీని బలోపేతం చేసే వ్యక్తి ప్రస్తుతం బీజేపీకి చాలా అవసరం అంటున్నారు జ్యోతిష్యులు.