రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » మఖ నక్షత్రమా? ఇతరులకు మంచి విషయాలు నూరిపోస్తారు (Religion| Astrology| Panchang| Magha nakshatra| Red Colour| Wednesday| Sunday)
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
Woman
WD
కేతుగ్రహ నక్షత్రమైన మఖంలో పుట్టిన జాతకులు ప్రతి విషయాన్ని అతి జాగ్రత్తగా పరిశీలిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు వెనుక ఆలోచిస్తారు. ఇతరులకు ఎప్పుడూ మంచి విషయాలను నూరి పోస్తుంటారు. పొదుపు, జీవితం పట్ల అభద్రతాభావం ఉంటుంది.

జీవితంలో ఎలాంటి లోటు వీరికుండదు. మంచి మనుషులుగా పేరుతెచ్చుకునే ఈ నక్షత్ర జాతకులు సౌమ్యులుగా ఉంటారు. వీరికి గృహోపయోగం, విదేశీయాన యోగం మొదలైనవి కలిసి వస్తాయి. స్పెక్యులేషన్ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉంటే ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారని జోతిష్య నిపుణులు అంటున్నారు.

గణితం, అడ్మినిస్ట్రేషన్‌లలో నిపుణత కలిగి ఉండే ఈ మఖ నక్షత్ర జాతకులు.. ఇతరుల సొమ్మును ఏ మాత్రం ఆశించరు. ఉదయం నుంచి రాత్రి వరకు తీవ్రంగా శ్రమించే నైజం గల వీరు.. నిద్రలేమిని మాత్రం భరించలేరు. జరిగిన పోయిన సంఘటనలను అంత సులువుగా మరిచిపోరు. అప్పుడప్పుడు తలచుకుని బాధపడుతారు.

ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్న వస్తువులైనా వీరి దగ్గర కొత్త వస్తువుల్లా ఉంటాయి. ఇతరులు ఆపదలో ఉన్నారంటే వారికి ముందు జాగ్రత్తలు చెబుతారు. కానీ ఆపద వస్తే మాత్రం ఆదుకునే స్థితిలో ఉండరు.

ఇకపోతే.. మఖ నక్షత్రంలో పుట్టిన జాతకులకు ఆదివారం అన్ని విధాలా కలిసొస్తుంది. బుధవారం, శనివారం సామాన్య ఫలితాలను ఆశించవచ్చు. అయితే మంగళవారం మాత్రం ఎలాంటి కార్యాన్ని ప్రారంభించడం కూడదు.

అలాగే 1, 4 వీరికి అదృష్ణ సంఖ్యలు. ఎరుపు రంగు ఈ జాతకులకు శుభ ఫలితాలను అందిస్తాయి. అందుచేత ఎరుపు చేతిరుమాలును మఖ నక్షత్రంలో పుట్టిన జాతకులు ఉపయోగించడం శ్రేయస్కరమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: మఖ నక్షత్రం, ఎరుపు, ఆదివారం, బుధవారం, ఆధ్యాత్మికం, భవిష్యవాణి, పంచాంగం