మేషం: మేషరాశి జాతకులకు అక్టోబర్ నెల బాగుంటుంది. ఈ నెలలో పదవులు, కీర్తి-ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దూరప్రయాణాలు చేసే యోగంవుంది. మీ బంధువులలోని వ్యాపారస్తులకు ధనలాభం. మిత్రులనుండి సహాయ సహకారాలుంటాయి.
వృషభం: వృషభరాశివారికి ఈ నెలలో ధార్మిక కార్యక్రమాలపై ఇష్టం కలుగుతుంది. దీంతోపాటు ఆధ్యాత్నికంవైపు వెళ్ళాలనే కోరిక తీవ్రమౌతుంది. కొత్త కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించుకుంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. మానసికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి.
మిథునరాశి: మిథునరాశి జాతకులకు ఈ నెలలో పదోన్నతులు కలిగే సూచనలున్నాయి. భూమికి సంబంధించిన విషయాలలో నష్టాలు సంభవిస్తాయి. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీరు గతంలో వేసుకున్న ప్రణాళికలేవైతే ఉన్నాయో వాటివలన అధిక లాభాలను ఆర్జిస్తారు. ఈ నెలలో భౌతికపరమైన శుఖాలను అనుభవిస్తారు. మీరు చేసే ప్రయాణాలలో మీ భాగస్వామి ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
కర్కాటకరాశి: కర్కాటకరాశి జాతకులకు వాహనసౌఖ్యం కలుగుతుంది. కాని అతి కష్టం మీద మీరు చేసే పనులలో తక్కువ లాభాలు కలిగే సూచనలున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉన్నత పదవులను అందుకుంటారు. షేర్ మార్కెట్, లాభాలతోకూడుకున్న వ్యాపారాలలో వివాదాలకు దూరంగా ఉండండి. వీటి వలన మీ మిత్రులతో భేదాభిప్రాయాలు కలిగే సూచనలున్నాయి.
సింహరాశి: సింహరాశి జాతకులకు అక్టోబర్ నెలలో లాటరీల ద్వారా లాభాలు కలిగే సూచనలున్నాయి. కుటుంబంలో కలతలతో దుఃఖాన్ని అనుభవించే సూచనలున్నాయి. ఆరోగ్యం అంతగా బాగుండదు. పాత మిత్రులను కలుసుకుంటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. మానసికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి.
కన్యారాశిః కన్యారాశి జాతకులకు అక్టోబర్ నెలలో భూసంపద పెరిగే సూచనలున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారులకు కష్టాలు తప్పవు. శారీరక శ్రమ ఏర్పడుతుంది. పదవులు కోల్పోయే అవకాశాలున్నాయి. కాని సమాజంలో గౌరవం ఉంటుంది.