రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » గృహప్రవేశం చేస్తున్నారా...! (Sweet Home | Life | Vasthu | Astrology | Constuction | House | Flat | Plot)
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
FILE
గృహమేకదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. ప్రతి కుటుంబానికి కావలసింది సౌకర్యవంతమైన, శుఖాలనిచ్చేది ఇల్లు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఇంటిని కట్టుకుంటారు. ఆ కట్టుకునే ఇల్లు గృహ యజమానికి సుఖాన్నిచ్చేదిగా ఉండాలి. అంతేగాని అతని ప్రాణాలు హరించేదిగా ఉండకూడదంటున్నారు పెద్దలు.

కాబట్టి వాస్తు-జ్యోతిష్య శాస్త్రాన్ననుసరించి ఇల్లు కట్టేటప్పుడు అది యజమానికి లాభం చేకూరుతుందా లేక నష్టాన్నిస్తుందా అనేది గమనించాలి. అలాగే కట్టిన ఇల్లు కొనే సందర్భంలో అది నివాసయోగ్యమైనదేనా అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలంటున్నారు జ్యోతిష్యశాస్త్రజ్ఞులు. అలాగే గృహప్రవేశం చేసే సమయంలోను, అలాగే గృహప్రవేసం చేసిన తర్వాత ఆచరించవలసిన కొన్ని విషయాలను శ్రద్ధగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు వాస్తు-జ్యోతిష్య నిపుణులు.

** ఏదైనా వీధి చివర లేదా రోడ్డుకు అడ్డంగా ఉన్న ఇల్లు(డెడ్ ఎండ్) అశుభాన్ని కలుగజేస్తుంది. వీధికి ఇరువైపులా ప్రవేశం ఉండాలి. అలా లేకుండా ఉండే ఇల్లు గృహ యజమానికి నష్టం కలిగిస్తుంది.

** ఒంటి గోడతో రెండు ఇండ్లను నిర్మించివుంటే (జాయింట్) ఆ ఇల్లు యమరాజ్ లాగా కష్టాలను కలుగజేస్తుంది. గృహయజమానికి కష్టాలను కొని తెచ్చిపెడుతుంది.

** ఇంటికి తూర్పు, ఉత్తర దిక్కులలో పల్లంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఇంటికి పశ్చిమ, దక్షిణ దిక్కులలో ఎత్తుగా ఉండాలి. దక్షిణ దిక్కులో ఎత్తుగా ఉంటే ధనవృద్ధి, పశ్చిమంలో లోతుగా ఉంటే ధన నష్టం కలుగుతుంది.

** ఇంటి నలువైపులా, మెయిన్ గేట్ ఎదుట ఖాళీ స్థలం వదలాలి. ఇది ఇంటి యజమానికి చాలా లాభదాయకం.

** ఇంటి ముందు దేవాలయం ఉండకూడదు. అలాగే దేవాలయపు నీడ ఇంటిపై పడకూడదు. ఇది గమనించి ఇల్లు కొనేందుకు ప్రయత్నించండి.

** ఒకవేళ ఇల్లు పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కువైపు పొడవుగా ఉంటే ఆ ఇల్లు సూర్యబేధి, అదే ఉత్తరం నుంచి దక్షిణం వైపు పొడవుగా ఉంటే ఆ ఇల్లు చంద్రబేధి అని చెప్పబడుతోంది. శాస్త్రాలననుసరించి చంద్రబేధి కలిగిన ఇల్లు శుభకరం. అదే ఇంట్లో వరండాకు ఖాళీ స్థలం వదిలివుంటే అది చంద్రభేది ఇల్లు అవుతుందంటున్నారు వాస్తు నిపుణులు.

** ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉండాలి. అందునా మట్టితో కూడుకున్న ప్రదేశం ఉంటే మరీ మంచిది.

** పంచకాలు అంటే ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్రం, ఉత్తరాభాద్రం, రేవతి నక్షత్రాలలో ఇంటికి రంగులు వేయకూడదు. నీటికి సంబంధించిన పనులు చేయకూడదు. ద్వారాలు, తలుపులకు సంబంధించిన పనులు అశుభాన్నిస్తాయి.

** కొత్త ఇంట్లో మెయిన్ గేట్ నిర్మించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. మెయిన్ గేట్ విరిగిపోతే స్త్రీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కొత్త ఇంట్లో ఏదైనా వస్తువు విరిగిపోతే, ఇంట్లోని సభ్యులలో ఎవరో ఒకరు మృత్యుముఖం పట్టవచ్చు లేదా మృత్యువును ఎదుర్కోవాల్సి వస్తుంది.

** ఇంట్లో విరిగిన మంచం, విరిగిన పాత్రలు, విరిగిపోయిన ఆసనాలు అంటే కుర్చీలు, టేబుళ్ళు, విరిగిపోయిన సైకిల్ లేదా పాడైపోయిన వాహనాలు, విరిగిపోయిన వాహనాలుంటే అశుభ ఫలితాలనిస్తాయి.
FILE


** ఇంట్లో కుక్కలను పెంచకూడదు.

** ఇంటి లోపల పెద్ద పెద్ద చెట్లుండకూడదు, ఎందుకంటే పెద్ద పెద్ద చెట్ల వేర్లలో పాములు, తేళ్ళు సునాయాసంగా స్థావరాలను ఏర్పరచుకుంటాయి. వీటివలన అశుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్య శాస్త్రజ్ఞులు.

కొత్త ఇల్లు నిర్మించిన తర్వాత గృహ యజమాని, యజమానురాలు గృహప్రవేశం చేసేటప్పుడు మంచి మనసుతో ప్రవేశించాలి. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత శుఖంగా, ప్రశాంతంగా ఉండాలి. దీంతో భార్యా-భర్తలు శుఖంగా ఉండగలుగుతారు.

అలాగే ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు లేదా ఇల్లు కొనే సందర్భంలో మనస్సులో ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలి. ఇలాంటి సమయంలో మీ ఇష్ట దైవాన్ని, కులదైవాన్ని స్మరించుకోవాలి. అలాగే మీ పితృదేవతల ఆశీర్వాదంతో గృహప్రవేశం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయంటున్నారు వాస్తు-జ్యోతిష్య శాస్త్రజ్ఞులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: గృహమేకదా స్వర్గసీమ, సౌకర్యవంతం, ప్రాణాలు, వాస్తుజ్యోతిష్య శాస్త్రం