రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » తలలో పువ్వులు పెట్టుకున్నట్లు కలగన్నారా? (Astrology| Panchang| Flowers| Head| Fruits| Things| Gold)
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
WD
పువ్వులు గల చెట్లను కలలో చూసినట్లైతే చేయు పనుల్లో ఆటంకాలు కలుగుతాయని జ్యోతిష్కులు అంటున్నారు. అయితే పువ్వులు తలలో పెట్టుకున్నట్లు కల వచ్చినచో అధిక సంతోషము కలుగునని వారు చెబుతున్నారు.

అలాగే పువ్వులను వాసన చూసినట్లు కల వచ్చినచో స్తీ సౌఖ్యం, స్త్రీ వలన ధనలాభము కలుగును. పచ్చని కాయలు గల చెట్టును కలలో వస్తే మాత్రం అనుకున్న కార్యములు సకాలంలో పూర్తికావని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇకపోతే.. ముత్యములు, రత్నములు కలలో కనిపిస్తే.. అష్టైశ్వర్యాలు, శుభఫలితాలుంటాయి. బంగారు వస్తువులను బహుమతిగా వచ్చినట్లు కలగంటే దూరపు బంధువుల నుంచి ఆస్తి చేజిక్కుతుంది.

అలాగే బంగారు నాణెముల ఇతరులకు ఇచ్చినట్లు కల వచ్చినచో స్నేహితులు ఎక్కువవుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దుకాణములో వస్తువులు కొనునట్లు గాని, చూచినట్లుగాని కలలో కనిపించడం చాలా మంచిది. ఇలా కలగంటే.. ధనలాభము, వస్త్ర లాభం కలుగును.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: భవిష్యవాణి, పంచాంగం, పువ్వులు, తల, పచ్చని కాయలు, వస్తువులు, బంగారు