రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » పూర్వాషాఢ నక్షత్రమా? ఐతే బంధువర్గాన్ని మోసం చేస్తారట! (Purvashada Nakshatra | Religion | Panchang | Astrology)
పంచాంగం
Bookmark and Share Feedback Print
 
FILE
పూర్వాషాఢ నక్షత్రములో పుట్టిన జాతకులు బాల్యంలో బంధువర్గం, కుటుంబాన్ని మోసం చేస్తారు. ఏ రంగంలోను ఓటమిని అంగీకరించరు. నమ్మిన వారి చేతులో మోసపోతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే నాయకత్వ లక్షణాలు కలిగివుండే ఈ జాతకులు పుట్టిన ప్రాంతానికి దూరంగా రాణిస్తారు.

ఈ నక్షత్రము నందు జన్మించిన జాతకులకు ఇతరులను ఆకర్షించే ఛాయను కలిగివుంటారు. విలాసవంతమైన జీవితాన్ని కోరుకోవడమే గాకుండా సాధిస్తారు. సంతానం మీద ఎవ్వరి నీడ పడకుండా జాగ్రత్త తీసుకుంటారు. కుటుంబ జీవితాన్ని, సామాజిక జీవనాన్ని వేర్వేరు గడుపుతారు. రాజకీయ, న్యాయపరమైన అంశాలు కుటుంబం మీద ప్రభావం చూపకుండా జాగ్రత్త తీసుకుంటారు.

ఆధ్యాత్మిక విషయాలంటే ఆసక్తి కలిగివుండే ఈ జాతకులు స్నేహితులు, సహోదర వర్గం వల్ల జీవితంలో చెప్పుకోదగిన విజయాలు సాధిస్తారు. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణిస్తారు.

ఇకపోతే.. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన జాతకులకు నలుపు, నీలపు రంగులు అన్ని విధాలా కలిసివస్తాయి. అందుచేత నలుపు రంగు చేతిరుమాలును వాడటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇదేవిధంగా పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు 4,8 అనే సంఖ్యలు అదృష్టాన్నిస్తాయి. 5, 6 3, 7 సామాన్య ఫలితాలనిస్తాయి. అయితే 1, 2, 9 మాత్రం అనే సంఖ్యలు మాత్రం వీరికి అశుభఫలితాలనిస్తుంది. ఇంకా శనివారం ఈ జాతకులకు అనుకూలిస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: పూర్వాషాఢ నక్షత్రం, బంధువర్గం, మోసం, ఆధ్యాత్మికం, పంచాంగం, భవిష్యవాణి