రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » సూర్యగ్రహ అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి!? (Sun | Religion | Astrology | Panchang | Wheat)
FILE
సూర్యుని అనుగ్రహం లేకపోతే కోరిన విద్య లభించదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. జనకమహా రాజు గురువు యాజ్ఞవల్య్కుడు సూర్యుని అశుభ దృష్టి వల్ల వేదవిద్యను అభ్యసించలేకపోయాడు. అందువల్ల తపస్సు చేసి సూర్యుని శుభదృష్టి వల్ల సరస్వతిదేవి అనుగ్రహంతో శాస్త్రజ్ఞానం పొంది, యాజ్ఞవల్య్కస్మృతిని అందించాడు.

అందుకే నవగ్రహాల్లో మొట్టమొదటైన సూర్యుడిని ఆరాధన చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఆదివారం రోజున లేదా ప్రతిరోజూ ఉదయం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం.. అని స్తుతించాలి.

సూర్యుని అనుగ్రహం కోసం మాణిక్యాన్ని ధరించాలి. గోధుమలను, ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి. పాయసం నివేదించాలి. సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయం పఠించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia