రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » మృగశీర్ష నక్షత్రంలో జన్మించిన స్త్రీలు భాగ్యవంతులట!! (Mirugaseerisham Star | Women | Religion | Astrology | Panchang)
Astro
WD
మృగశీర్ష నక్షత్రంలో జన్మించిన జాతకులు సౌందర్యము, శరీరపుష్టి కలవారుగా ఉంటారు. కానీ స్థిరమైన ఏ కార్యము చెయ్యలేరు. మృగశీర్ష నక్షత్ర జాతకులు భాగస్వామ్య వ్యవహారాలందు, ఇతరులను విశ్వసించే విషయంలో జాగ్రత్త వహించాలి. ఇతరులను నమ్మితే నష్టం తప్పదు. వీరిలో అధిక ఆడంబరము ఉండదు.

మితంగా ఖర్చు చేయాలని అందరికీ ఉపదేశించే ఈ జాతకులు మాత్రం అధికముగా ఖర్చు చేశారు. అందువల్ల జీవితంలో కష్టపడతారు. ఆదాయము కన్నా వ్యయం ఎక్కువ. ఇతరుల అభిప్రాయాలను శ్రద్ధగా వినే ఈ జాతకులు సొంత విషయాల్లో మాత్రం ఇతరుల అభిప్రాయాలను స్వీకరించరు.

ఇక మృగ శీర్ష ఒకటో పాదమందు జన్మించిన జాతకులు సౌందర్యము, ధనము కలవారు. శీలము గలవారు. కోపమెక్కువ. మృగశీర్ష రెండో పాదములో జన్మించిన జాతకులు వివాదమంటే ఇష్టపడరు. మృగశీర్ష మూడో పాదములో పుట్టినవారైతే ఎల్లప్పుడు ప్రసన్నులు. అన్యదేశమందు సంచరిస్తారు. ఉపకారము చేసినా గుర్తుపెట్టురకునేవారు. మంచి మాటలు పలుకువారు. బుద్ధిమంతులై ఉంటారు. మృగశీర్ష నాలుగో పాదములో జన్మించిన వారైతే.. ఇతరుల చేతిలో ఉన్న వస్తువులను స్వాధీనపరుచుకొందురు.

ఈ నక్షత్రమున జన్మించిన స్త్రీలు ప్రత్యేక గౌరవము, రూప సౌందర్యమును కలిగివుందురు. మాట, ప్రవర్తన, స్వభావమందు వీరు సౌమ్య శీలురు. శరీరశుద్ధితో పాటు ఇతర విషయములందు శుచిశుభ్రత పాటిస్తారు. అయినను వీరికి మనఃశక్తి చాలా తక్కువగా ఉండును. చిన్న చిన్న విషయాలకు కూడా అనవసరంగా చింతించి అస్వస్థతకు గురవుతారు. మృగశీర్ష నక్షత్ర స్త్రీలు మొత్తంమీద భాగ్యవంతులేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం నక్షత్రములు వీరికి పనికిరావు. ఈ నక్షత్రము వ్యవసాయం, వ్యాపారం ఆరంభించడానికి, వివాహం, యాత్రలు, గృహ నిర్మాణం, ఆలయ నిర్మాణం చేసేందుకు చాలా మంచిది.
సంబంధిత సమాచారం
Feedback Print