గిరీష్ గారూ... మీరు చవితి శుక్రవారం ధనిష్ట నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. మీకు అష్టమ శనిదోషం, లగ్నంలో గురుదోషం ఉన్నందువల్ల ప్రేమ వివాహాల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. వెంకటేశ్వరస్వామిని ఆరాధించడం వల్ల మీకు ఆటంకాలు తొలగి అనుకున్నది సాధిస్తారు.
నీలిమగారు తదియ సోమవారం జ్యేష్ట నక్షత్రం వృశ్చిక రాశి నందు జన్మించారు. తృతీయంలో గురుదోషం ఉన్నందువల్ల వివాహ విషయంలో జాతకపొంతన చాలా అవసరమని గమనించండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. శుభం కలుగుతుంది. |