శ్రీదేవి గారూ...
మీరు బహుళ పాడ్యమి శనివారం ధనిష్ట నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. ఈ సెప్టెంబరుతో మీకు శనిదోషం తొలగిపోతోంది. ఈ ఏడాది నవంబరుతో మీ మీద ఉన్న రాహుదోషం తొలగిపోవడంతో మంచి అభివృద్ధి కానవస్తుంది.
2010లో మీరు బాగా స్థిరపడతారు. ఈ సంవత్సరము నవంబరులోపుగానీ, 2010 ఏప్రిల్ నుంచి ఆగస్టులోపుగానీ మీకు వివాహం అవుతుంది. కనకపుష్యరాగం 2 కారెట్లు ధరించండి. అభివృద్ధి కానవస్తుంది.
ప్రతిరోజూ లలితా సహస్రనామపారాయణం చదివినా లేక విన్నా బాగా అభివృద్ధి చెందుతారు. |