సోమసుందరంగారూ...
మీరు షష్ఠి ఆదివారం బై సోమవారం పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. 2012 వరకూ అష్టమ శనిదోషం ఏర్పడుచున్నందువల్ల శనికి మీ పేరుతో ప్రతి శనిత్రయోదశికి తైలాభిషేకం చేయించిన కలసి వస్తుంది.
ఈ సంవత్సరం చివరివరకూ గురుఛండాలదోషం ఉన్నందువల్ల నెలకు ఒక గురువారంనాడు నవగ్రహాల చుట్టూ 16సార్లు ప్రదక్షిణ చేసి చిటికెడు శనగలను గురు గ్రహ పాదాల వద్ద ఉంచి నమస్కరించండి. మీకు ఆరోగ్యము, అభివృద్ధి చేకూరుతుంది. |