కమలాకరరావు: మీరు దశమి మంగళవారం రోహిణి నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. ఈ సెప్టెంబరుతో మీకు అర్ధాష్టమ శనిదోషం తొలగిపోతుంది. 2010 ఫిబ్రవరి నుంచి యోగప్రదమైన కాలం ప్రారంభమవుతోంది. 2011 నుంచి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. లక్ష్మీగణపతిని ఆరాధించడంవల్ల మీరు బాగా అభివృద్ధి చెందుతారు.