మీరు అమావాస్య శుక్రవారం రేవతి నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. మీ జన్మలగ్నము మిథునం, జన్మరాశి మీనం, రేవతి నక్షత్రం అమావాస్య శుక్రవారం జన్మించారు. మీ జాతకంలో శుక్రుడు, రవి ఉచ్చస్థానంలో ఉండటంతో మంచి యోగాలున్నాయి. మనఃకారకుడు, కుటుంబాధిపతి, ధనాధిపతి అయిన చంద్రుడు రాజ్యము నందు ఉండటం వల్ల మంచి నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి చెందండి.
ఈ సంవత్సరము నవంబరు నుంచి కేతువు సప్తమ స్థానము నందు రాహువు ఉండటం వల్ల చిన్న చిన్న విషయాల్లో చికాకులు, నిరుత్సాహం వంటి ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోయి అభివృద్ధి చెందుతారు. ప్రతిరోజూ శ్రీమన్నారాయణుడిని తులసీ దళాలతో పూజించండి. 2013వరకు శుక్రమహర్ధశలో శని అంతరం జరుగుతుంది.