జి. మాధురి-విజయవాడ: మీరు నవమి ఆదివారం సింహలగ్నము పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి నందు జన్మించారు. మీకు ఏలినాటి శనిదోషం తొలగిపోయింది. ఈ డిసెంబరుతో కేతుదోషం తొలగిపోవడం వల్ల 2010 నుంచి యోగప్రదమైన కాలం ప్రారంభమవుతోంది. ధనస్థానము నందు గురు, శనులు ఉండటం వల్ల ప్రతి పనిలోనూ అధికశ్రమ అవసరం.
మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 2011 వరకు కేతు మహర్ధశ జరుగుతున్నందువల్ల ఒత్తిడి, చికాకు, ఆందోళనలు ఎదుర్కొంటారు. 2011 నుంచి 2031వరకు శుక్ర మహర్ధశ మంచి యోగాన్నిస్తుంది. ప్రతిరోజూ ఇష్టకామేశ్వరి ఆరాధించండి కలిసివస్తుంది.