నా సోదరి వివాహం ఎప్పుడు జరుగుతుందో దయచేసి తెలుపగలరు...
నరేంద్ర-కాకినాడ:
నరేంద్ర-కాకినాడ: మీ సోదరి అష్టమి శనివారం మిథునలగ్నము విశాఖ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. ఈమెకు కుటుంబస్థానము నందు, ధనస్థానము నందు, ద్వితీయస్థానములో కుజ, రాహువులు ఉండటం వల్ల, లగ్నమునకు గురువీక్షణం వల్ల ఈమెకు కుజదోషం లేదు. వివాహ విషయంలో జాతక పొంతన, మెలకువ అవసరం. వ్యయాధిపతి అయిన శుక్రుడు భర్త స్థానము నందు ఉండటం వల్ల ఉమామహేశ్వరులను ఆరాధించినట్లైతే మీకు ఏ దోషాలు తొలగిపోయి అభివృద్ధి పొందుతారు.