వల్లీరాజశేఖర్-చిత్రాడ: మీరు దశమి మంగళవారం ధనుర్‌లగ్నము పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. మీకు గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడటంవల్ల, 2012వరకు అష్టమ శనిదోషం ఉండటంతో శనికి మీ పేరుతో నెలకు ఒక శనివారంనాడు తైలాభిషేకం చేయించి, శంఖుపూలతో శనిని పూజించినట్లైతే మీకు శుభం కలుగుతుంది. శంఖపాలకాలసర్పదోషం ఉన్నందువల్ల శ్రీకాళహస్తిలో రాహు, కేతువుల పూజ చేయించండి. మీకు శుభం కలుగుతుంది.