భద్రాచలం నుంచి ప్రశ్న: మీరు అష్టమి గురువారం సింహలగ్నము హస్త నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. మీకు 2015 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో నెలకు ఒకసారి తైలాభిషేకం చేయించినట్లైతే శుభం కలుగుతుంది. కళత్రకారకుడైన శని ధనస్థానము నందు ఉండటం వల్ల వివాహం కాకుండా మీకు అభివృద్ధి ఉండజాలదు. 2010 ఉగాది నుంచి 2011 ఉగాది లోపు మీకు వివాహం అవుతుంది.