రామ-హైదరాబాద్: మీరు షష్టి గురువారం మకరలగ్నము పూర్వాభాద్ర నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. మీకు సప్తమ స్థానము నందు గురుబలం ఉండటం వల్ల ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధి పొందుతారు. అయితే ధనాధిపతి అయిన శని రాహువుతో కలయిక వల్ల తాత్కాలికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నెమ్మదిగా పురోభివృద్ధి కానవస్తుంది. ప్రతిరోజూ కనకథార స్తోత్రమును చదివినా లేక విన్నా మీకు శుభం కలుగుతుంది.