నా గ్రహ స్థితి గురించి, నా వివాహం గురించి తెలియజేయగలరు...
శరత్-హైదరాబాద్
శరత్-హైదరాబాద్: మీరు చవితి శనివారం వృశ్చిక లగ్నము జ్యేష్టా నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. మీ భార్యస్థానము నందు శని ఉండటం వల్ల భార్యకారకుడైన శుక్రుడు రవి, బుధులతో కలిసి హస్తగతం అవడం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి. ధనాధిపతి అయిన బృహస్పతి భాగ్యాధిపత్యం పొందిన చంద్రునితో కలవడం వల్ల మీ పేరుతో ఏజెన్సీ, సంస్థలు, కాంట్రాక్టు. కంజ్యూమర్ సంబంధించి వ్యాపారాలు బాగా కలిసివస్తాయి.