రాజేంద్రప్రసాద్-చిక్కబల్లాపూర్: మీరు అష్టమి ఆదివారం కన్యాలగ్నము శతభిషా నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. మీకు 2012 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శ్రనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించినట్లైతే కలిసివస్తుంది.
సప్తమాధిపతి అయిన బృహస్పతి చతుర్థము నందు ఉండటం వల్ల వివాహ విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 2011 నందు మీకు వివాహం అవుతుంది. 2012 వరకు శని మహర్ధశలో రాహు అంతరం జరగడంవల్ల ఈ రాహువు మీకు మంచి యోగాన్నిస్తాడు. 2014 నుంచి బుధ మహర్ధశ మీకు కలిసివస్తుంది.