నా భవిష్యత్ ఎలా ఉంటుంది. వివాహం ఎప్పుడు జరుగుతుంది?
నల్గొండ నుంచి శ్రీలత ప్రశ్నకు డాక్టర్ రామన్ సలహా:
మీరు షష్టి శనివారం మకరలగ్నము పుబ్బ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. మీకు పంచమ స్థానము నందు శుక్ర, బుధులు ఉండటం వల్ల మీరు కంప్యూటర్, ఎలక్ట్రానికల్, టెక్నికల్ రంగంలో బాగా రాణిస్తారు.
2012 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో నెలకు ఒకసారి తైలాభిషేకం చేయించినట్లైతే కలిసివస్తుంది. వర్తమానం మీకు కుజమహర్ధశ నడుస్తుంది. 2010 నవంబరుతో ఈ కుజ మహర్ధశ అయిపోతుంది.
2010 నవంబరులోపు మీకు వివాహం అవుతుంది. ఆ తదుపరి రాహు మహర్ధశ 18 సంవత్సరములు మంచి యోగాన్నిస్తుంది. ప్రతిరోజూ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడంవల్ల మీకు కలిసివస్తుంది.