తిరువూరు నుంచి శోభ ప్రశ్నకు డాక్టర్ రామన్ సలహా: మీరు త్రయోదశి బుధవారం మేషలగ్నము పూర్వాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. మీది మేషలగ్నము అయి ఉండి, లగ్నము నందు రవి ఉచ్ఛి చెందడంవల్ల, వ్యయము నందు శుక్రుడు ఉచ్ఛి చెందడంవల్ల, లగ్నాధిపతి అయిన కుజుడు ధనస్థానము నందు ఉండటంవల్ల వివాహానంతరం మీరు బాగా అభివృద్ధి చెందుతారు. మీ 25 సంవత్సరము నందు వివాహం అవుతుంది. 2007 నుంచి 2024 వరకు బుధ మహర్ధశ జరుగుతున్నందువల్ల ఈ బుధుడు మీకు 2010 నుంచి యోగాన్ని ఇస్తాడు.