ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నదా?
దొమ్మేరు నుంచి శిరీష ప్రశ్నకు డాక్టర్ రామన్ సలహా: మీరు ద్వాదశి శనివారం కుంభలగ్నము పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. మీ పేరు మీకు బాగా కలిసివస్తుంది. 2012 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల రెండు నెలలకు ఒక శనివారంనాడు 16సార్లు నవగ్రహప్రదక్షణ చేసి 16వత్తులు ఏకం చేసి ఆవునేతితో శనికి దీపారాధన చేయండి.
2014 వరకు విద్యాయోగం ఉన్నందువల్ల చదువును కొనసాగించండి. మీరు ప్రైవేట్ సంస్థలలో బాగా స్థిరపడతారు. మీ 23లేక 24 సంవత్సరము నందు వివాహం అవుతుంది.