ప్రణీత: మీరు పంచమి శనివారం కన్యాలగ్నము పూర్వాషాఢ నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. మీకు లగ్నము నందు కుజుడు ఉండటంవల్ల, అష్టమ స్థానమ నందు రాహువు ఉండటం వల్ల, ఒక సంబంధం అనుకుని ఆగిన తదుపరి మీకు వివాహం అవుతుంది. వివాహ జీవితం చాలా శుభదాయకంగా ఉంటుంది. ధన భాగ్యాధిపతి అయిన శుక్రుడు ధనస్థానము నందు ఉండటం వల్ల వివాహానంతరం మీరు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు.