రవికృష్ణ-సికింద్రాబాద్: మీరు చవితి శుక్రవారం కర్కాటకలగ్నము ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. మీకు భాగ్యస్థానము నందు గురు, చంద్రుల కలయిక వల్ల గజకేశరి యోగం ఏర్పడటం వల్ల 2010 మే నుంచి బృహస్పతి మీనరాశి సంచరించడంవల్ల 2010 మే తదుపరి మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.
భార్యకారకుడైన శని వ్యయము నందు ఉండటంవల్ల మీకు వివాహం ఆలస్యమైంది. 2010 నవంబరుతో కేతు మహర్ధశ పూర్తవుతుంది. 2010లో మీకు వివాహం అవుతుంది. ఆ తదుపరి శుక్ర మహర్ధశ 20 సంవత్సరాలు, రవి మహర్ధశ 6 సంవత్సరాలు మీకు మంచి యోగాన్నిస్తుంది.