విజయలక్ష్మి: విజయగారు మీరు పూర్ణిమ సోమవారం వృశ్చిక లగ్నము చిత్తానక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. మీ భర్త విదియ సోమవారం కన్యాలగ్నము రోహిణి నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. మీది కన్యారాశి అవడం వల్ల, మీ భర్తది కన్యాలగ్నము, రోహిణి నక్షత్రం, వృషభరాశి కావడం వల్ల మీ ఇద్దరి యోనికూటమి పాము, పులి అయ్యింది.
గ్రహమైత్రి శుక్ర, బుధులు అయ్యారు. మీకు ఏలినాటి శనిదోషం 2014 వరకు ఉన్నందువల్ల ప్రతినెల శనికి శనివారంనాడు తైలాభిషేకం చేయించి నీలపు శంఖుపూలతో శనిని పూజించి ఒక ధూప్‌స్టిక్‌ను వెలిగించి శనికి ధూపం వేయండి. మీ కుటుంబ సమస్యలు పటాపంచలవుతాయి. 2012 తదుపరి మీకు సంతాన యోగం ఉంది.