మా అమ్మాయి రెండు పర్యాయములు బ్యాంకు పరీక్షలో సెలక్టు అయినది. కానీ ఉద్యోగము రాలేదు...
నిర్మల: మీ కుమార్తె శ్వేత త్రయోదశి బుధవారం కర్కాటక లగ్నము చిత్తా నక్షత్రం తులారాశి నందు జన్మించారు. మీకు 2012 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో 3 నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించినట్లైతే కలిసివస్తుంది. వర్తమానం 2008 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు మీకు 2011 నుంచి మంచి యోగాన్నిస్తాడు. 2011 లేక 2012 నందు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. 2012 వరకు ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఇష్టకామేశ్వరిదేవిని ఆరాధించండి.. మీ సంకల్పం సిద్ధిస్తుంది.