నాగలక్ష్మి- గుంటూరు: మీరు దశమి సోమవారం మిథున లగ్నము జ్యేష్ట నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. మీకు సంతాన కారకుడైన శుక్రుడు తృతియము నందు ఉండటం వల్ల, విరోధిక్షేత్రము నందు ఉండటం వల్ల సంతాన విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోండి. 2004 నుంచి శుక్రమహర్ధశ ప్రారంభమైంది.
ఈ శుక్రుడు 2010 నుంచి మీకు మంచి యోగాన్ని ఇస్తాడు. 2010 లేక 2011 నందు మీకు సంతాన యోగం ఉంది. ఈ శుక్ర మహర్ధశ మీకు 2024 వరకు ఉన్నందువల్ల తలపెట్టిన పనిలో శుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది. ప్రతిరోజూ లక్ష్మీనారాయణుడిని ఆరాధించండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది.