ఎ. ప్రసన్నకుమార్-విజయనగరం: మీరు చవితి సోమవారం మకరలగ్నము ఆశ్లేష నక్షత్రం కర్కాటకరాశి నందు జన్మించారు. మీకు ఈ సంవత్సరము సెప్టెంబరుతో శనిదోషం తొలగిపోయింది. 2010 మేతో కుజస్తంభన తొలగిపోయి, 2010 ఆగస్టు నుంచి మంచి అభివృద్ధి కానవస్తుంది. సప్తమాధిపతి అయిన బుధుడు వ్యయము నందు ఉండటం వల్ల వివాహం ఆలస్యమైంది.
మీ 33వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. వివాహం కాకుండా మీకు అభివృద్ధి ఉండజాలదు. 2011 నుంచి రుణ విముక్తులై అభివృద్ధి పొందుతారు. ప్రతిరోజూ రాఘవేంద్రస్వామిని ఆరాధించండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది.