పి. శ్రీనివాస్-తెనాలి: మీరు చతుర్ధశి గురువారం వృషభలగ్నము ఆశ్లేష నక్షత్రం కర్కాటకరాశి నందు జన్మించారు. మీకు ఈ సంవత్సరము సెప్టెంబరుతో శనిదోషం తొలగిపోయింది. 2010 మే నుంచి సత్‌కాలం ప్రారంభమవుతోంది. భాగ్యరాజ్యాధిపతి అయిన శని లగ్నము నందు ఉండటం వల్ల నిరుత్సాహాన్ని విడనాడి సత్‌కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రీ కాళహస్తీశ్వరుని ఆరాధించడం వల్ల మీ సమస్యలు తొలగి అభివృద్ధి పొందుతారు.