రేష్మ-మంత్రిపాలెం: మీరు చతుర్ధశి గురువారం మేషలగ్నము ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. మీ జాతకం చాలా ఉన్నతమైనది. లగ్నమ నందు రవి ఉచ్ఛి చెందడంవల్ల, వ్యయము నందు శుక్రుడు ఉచ్ఛి చెందడం వల్ల లగ్నాధిపతి అయిన కుజుడు ధనస్థానము నందు ఉండటం వల్ల మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. 2010 మార్చి నుంచి మీ అభివృద్ధికి నాంది పలుకుతుంది. 2011 నుంచి దినదినాభివృద్ధి పొందుతారు. ప్రతిరోజూ వరసిద్ధి వినాయకుడిని ఆరాధించండి. పుష్యనీలం అనే రాయిని ధరించండి. మీ ఆటంకాలు తొలగిపోతాయి.