రేవతి నిడుమోలు: మీరు విదియ శనివారం కన్యాలగ్నము స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. మీకు లగ్నము నందు రవి ఉండటం వల్ల కుటుంబస్థానము నందు ఉచ్ఛశని చంద్రులు ఉండటం వల్ల వివాహానంతరం మీకు బాగా అభివృద్ధి చెందుతారు. 2010 జూన్ నుంచి డిసెంబరులోపు మీకు వివాహం అవుతుంది.
2017వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒకసారి శనికి తైలాభిషేకం చేయించి, శంఖుపూలతో శనిని పూజించినట్లైతే మీకు సర్వదోషాలు తొలగి అభివృద్ధి చెందుతారు. ఇంకా మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. మీ సోదరి ప్రతిభ సంవత్సరం, జనన సమయం తెలియపరిచి తేదిని తెలియజేయడం మరచినారు.