మా స్నేహితురాలి కుమార్తెకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?
సుశీల-విజయవాడ
సుశీల-విజయవాడ: మీ స్నేహితురాలి కూతురు దీప్తి బహుళ విదియ మంగళవారం కర్కాటకలగ్నము హస్త నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2015 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల తలపెట్టిన పనిలో ఆటంకాలు, చికాకులు, నిరుత్సాహం వంటివి ఎదుర్కొన్నా నెలకు ఒక శనివారంనాడు పదిసార్లు శనికి ప్రదక్షిణ చేసి తెల్లనిపూలతో శనిని పూజించండి. 2010 ఫిబ్రవరి తదుపరి మీరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. 2010 జూన్ తదుపరి దీప్తికి వివాహం అవుతుంది. వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి.