నా భర్త రాజగణేష్, నా కుమారుని జాతక వివరాలు తెలియజేయగలరు...
రాజగణేష్-కాకినాడ:
రాజగణేష్-కాకినాడ: మీరు చవితి బుధవారం మిధునలగ్నము హస్తనక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. మీకు వర్తమానం 2015 వరకు ఏలినాటి శనిదోషం ఉంది. శనికి మీ పేరుతో 3 నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించండి. శుభం కలుగుతుంది. ఈ శనిదోషం కూడా మీకు నెమ్మదిగా పురోభివృద్ధిని ఇవ్వగలదు. 2004 నుంచి 2020 వరకు గురు మహర్ధశ జరుగుతుంది.
ఈ గురువు మీకు 65 నుంచి 70 శాతం యోగాన్ని ఇస్తాడు. చేసే పనిమీద ఏకాగ్రత వహించండి. అప్పుడప్పుడు పొట్టకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. 2020 నుంచి 2039 వరకు శని మహర్ధశ 19 సంవత్సరాలు 88శాతం యోగాన్ని పొందుతారు. ప్రతిరోజూ లక్ష్మీగణపతిని ఆరాధించండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది.
మీ కుమారుడు త్రయోదశి బుధవారం సింహలగ్నము ఆరుద్ర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. సింహలగ్నము అయి ఉండి, లగ్నము నందు శని, కుజులు ఉండటం వల్ల అప్పుడప్పుడు మొండితనం చికాకులు కనపరిచినా 2012 నుంచి కుమారునికి అభివృద్ధి కానవస్తుంది. 2018 వరకు రాహు మహర్ధశ ఉంది.
ఈ రాహువు సామాన్యమైన అభివృద్ధినిస్తుంది. ఆ తదుపరి గురు మహర్ధశ 17 సంవత్సరాలు శని మహర్ధశ 19 సంవత్సరాలు ఉన్నత స్థితిలో ఉంటారు. ఇతను 24 లేక 25 సంవత్సరాల్లో స్థిరపడతారు. 27 సంవత్సరము నందు వివాహం అవుతుంది. లలితాదేవిని పూజించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.