వెంకటేశ్వరరావు: మీరు తదియ బుధవారం సింహలగ్నము అనూరాధ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. మీకు లగ్నము నందు శని, రాహువులు ఉండటం వల్ల కష్టేఫలి అన్న వాస్తవాన్ని గ్రహించండి. మీ సహాయం పొంది మీ మీద అపవాదులు వేసేవారు అధికంగా ఉంటారు. గురువు ఉచ్ఛి చెంది ఉండటం వల్ల చదువుల్లో నెమ్మదిగా అభివృద్ధి చెందుతారు. మీ 32వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. భార్య కారకుడైన శని లగ్నము నందు ఉండటం వల్ల మీకు వివాహం కాకుండా అభివృద్ధి ఉండజాలదు. ప్రతిరోజూ లక్ష్మీగణపతిని ఆరాధించండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది. పుష్యనీలం అనే రాయిని ధరించండి. అభివృద్ధి పొందుతారు.
మీ ప్రశ్నలను customer.care@webdunia.netకు పంపించండి.