నాకు పెళ్లైంది. ఒక అబ్బాయి కూడా పుట్టాడు. మా జాతకం ఎలా ఉంటుందో చెప్పండి
భవానీ
భవానీ: మీరు షష్టి శనివారం వృశ్చిక లగ్నము రేవతి నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. మీకు భర్తస్థానము నందు శని ఉండటం వల్ల మీరు కష్టించి పనిచేస్తారు. అనుకున్నది సాధిస్తారు. మనఃకారకుడైన చంద్రుడు కుజునితో కలయిక వల్ల మానసిక ప్రశాంతత ఉండజాలదు. వర్తమానం 2014 వరకు శుక్ర మహర్ధశ జరుగుతుంది. ఈ శుక్రుడు మీకు సామాన్యమైన యోగాన్నిస్తాడు. ఆరోగ్యములో అధికమైన జాగ్రత్త అవసరం. 2012 వరకు శుక్ర మహర్ధశ జరుగుతుంది. ఈ శుక్రుడు మీకు సామాన్యమైన యోగాన్నిస్తాడు. ఆరోగ్యములో అధిక శ్రద్ధ తీసుకోవడం అవసరం. 2014 నుంచి రవి మహర్ధశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్ధశ పది సంవత్సరాలు మంచి యోగాన్నిస్తుంది. నెమ్మదిగా స్థిరాస్తులను అభివృద్ధి చేసుకోండి. ప్రతిరోజూ ఉమామహేశ్వరుని పూజించండి. కలిసివస్తుంది.
మీ ప్రశ్నలను customer.care@webdunia.netకు పంపించండి.