ఫయాజ్: మీరు ద్వాదశి సోమవారం కన్యాలగ్నము ఉత్తరా నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. 2012 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి నెలకు ఒకసారి శనికి తైలాభిషేకం చేయించి ఎర్రని పూలతో పూజించండి. సప్తమ స్థానము నందు బుధుడు నీచి పొంది ఉండటం వల్ల ఈ బుధుడు రాజ్యాధిపతి అవడం వల్ల మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. కుటుంబస్థానము నందు, ధనస్థానము నందు కేతువు ఉండటం వల్ల ధనం బాగా ఖర్చు చేసేవారుగా ఉంటారు. స్నేహితులతో మెలకువ అవసరం. ప్రతిరోజూ వరసిద్ధివినాయకుడిని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది.
మీ ప్రశ్నలను customer.care@webdunia.netకు పంపించండి.