నా కుమారుడు పెళ్లి జరిగింది.. కానీ భార్యభర్తల మధ్య గొడవలు...
నారాయణ-మందస: మీ కుమారుడు పూర్ణిమ ఆదివారం కర్కాటక లగ్నము ధనిష్ట నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. మీ కుమారునికి లగ్నము నందు శని, శుక్రులు ఉండటం వల్ల భార్యకారకుడైన శని లగ్నము నందు ఉండటం వల్ల వివాహ జీవితం కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నెమ్మదిగా కుదుటపడతాయి. ఈ దోషం మే నెలతో తొలగిపోవడం వల్ల ఆగస్టు నుంచి అభివృద్ధి పొందుతారు. ఈ దోష నివారణకు కాత్యాయిన వ్రతం చేయించండి. కలిసివస్తుంది. ప్రతిరోజూ లక్ష్మీనారాయణ హృదయం చదవండి వల్ల కానీ వినడం వల్ల కానీ కుటుంబలోని దోషాలు తొలగిపోయి అభివృద్ధి చెందుతారు.